కాంగ్రెస్ లో బిఆర్ఎస్ నాయకులు భారీగా చేరికలు
:రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటమే మా లక్ష్యం:మాజీ ఎంపీటీసీ కాసర్ల సత్యవతి
కోదాడ,మే 09(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక 34 వ వార్డు నుండి మాజీ ఎంపీటీసీ కాసర్ల సత్యవతి ఆధ్వర్యంలో భారీగా బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరికలు.గురువారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి,కేఎల్ఎన్ ప్రసాద్,పంది తిరుపతయ్య,పాశం శ్రీనివాసరావు,గంధం యాదగిరి,కాంపాటి పుల్లయ్య ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి సమక్షంలో మాజీ ఎంపీటీసీ కాసర్ల సత్యవతి అధ్యక్షతన బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగినాయి.ఈ సందర్భంగా కాసర్ల సత్యవతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాకు కన్నతల్లి లాంటిది మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామంటే సొంత గూటిలో ఉన్నట్టే ఉంటామని అన్నారు.రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘువీరారెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచార నిర్వహించి కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కృషి చేస్తానని అన్నారు.

దేశంలోనే నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మెజారిటీ ఒక ప్రభంజనం సృష్టిస్తాదని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలకు అన్ని మతాలకు అనుకూలమైన పార్టీ అని అన్నారు.రాబోయే రోజులలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమక్షంలో కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన వారు కాసర్ల వసంత రాజశేఖర్,ముల్కలపల్లి సైదమ్మ,నందిగామ చిన్న లక్ష్మమ్మ,సోమపంగు బేబీ,సోమపంగు సునీత,సోమపంగు నిర్మల,నందిగామ రాణి,నందిగామ ప్రబంధ,అమరబోయిన రమ్య,పులి శిరోమణి,గంధం అరుణ,అమరబోయిన ప్రభాకర్,అమరబోయిన శ్రీకాంత్,నందిగామ హర్షవర్ధన్(నాని),ముల్కల్ పల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.



