ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపుకై ప్రతి ఒక్కరు కృషి చేయాలి ముత్తవరపు పాండురంగారావు
కోదాడ,మే 10(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘువీరారెడ్డి గెలుపుకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ డిసిసిబి డైరెక్టర్ ముత్తవరపు పాండురంగారావు అన్నారు.మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో శుక్రవారం గడపగడపకు ప్రచారం నిర్వహించిన ముత్తవరపు పాండురంగారావు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి ఆదేశాల మేరకు గడప,గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించామన్నారురాహుల్ గాంధీ ని ప్రధాని చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. రఘువీర్ రెడ్డి గెలుపు తో కోదాడ నియోజకవర్గం ఎక్కువ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.దేశం లోనే భారీ మెజారిటీతో రఘువీర్ రెడ్డిని గెలిపించాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



