Sunday, December 28, 2025
[t4b-ticker]

ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతా…

ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతా…

•భారీ మెజార్టీ ఇచ్చి నన్ను ఆశీర్వదించారు..

•నా ఎన్నికల ప్రచారం గొండ్రియాల నుండే ప్రారంభించాను…

•అనంతగిరి మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్న

•మరోసారి ఎంపీ అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజార్టీ ఇవ్వండి:కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

కోదాడ,మే 11(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తానని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపు కై అనంతగిరి మండల కేంద్రంలో శుక్రవారం ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేసి తీరుతుంది అన్నారు. ఇప్పటికే నాలుగు గ్యారెంటే పథకాలను అమలు చేశామని గుర్తు చేశారు. అంచలంచెలుగా ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని , ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల లోనే ప్రజాపాలన అందించడం ఆనందంగా ఉందన్నారు.

ప్రజలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దగ్గరవుతూ ఉండడంతో ఓర్వలేక మా పార్టీ ఎక్కడ కనుమరుగవుతుందోనని ప్రతిపక్ష టిఆర్ఎస్ పార్టీ ఆందోళనతో అడ్డగోలుగా అనవసరంగా మాట్లాడుతున్నారని వారు మండిపడ్డారు. గత పది ఏళ్లలో నియంత పాలన కొనసాగించాలని ప్రజలు ఆ పాలన నుండి విముక్తి పొంది స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నారని ఈ సందర్భంగా వారు అన్నారు. కోదాడ నియోజకవర్గ ప్రజలకు నేను జీవితాంతం రుణపడి ఉంటానని, నాకు ఊహించని మెజార్టీ ఇచ్చి రాష్ట్రంలోనే చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారన్నారు. అదే స్ఫూర్తితో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున నలగొండ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న రఘువీర్ రెడ్డికి భారీ మెజార్టీ ఇవ్వాలని హస్తం గుర్తుపై ఓటు వేయాలని ఈ సందర్భంగా ఆమె అభ్యర్థించారు. కమ్యూనిస్టు సోదరులు సైతం మద్దతు తెలపడం శుభ పరిణామం అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, అనంతగిరి మండల పార్టీ అధ్యక్షుడు ముస్కు శ్రీనివాస్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు కొండపల్లి వాసు, ఎంపీపీ చుండూరి వెంకటేశ్వరరావు , జడ్పిటిసి ఉమా శ్రీనివాసరెడ్డి , మండల నాయకులు బుర్ర పుల్లారెడ్డి ,డేగ కొండయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ బాబు నాయక్ ,సిపిఎం మండల కార్యదర్శిసూర్యనారాయణ,,ఈదుల కృష్ణయ్య , వెంపటి వెంకటేశ్వర్లు, ముత్తినేని కోటేశ్వరరావు, బుర్ర నర్సిరెడ్డి, మర్రి సంతోష్, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, గొట్టేముక్కల బాబురావు, నకిరికంటి సత్యానందం ఉయ్యాల వీరయ్య గౌడ్, మందపల్లి వెంకటేశ్వర్లు, నెల్లూరి ప్రభాకర్ రావు,కబీర్ దాస్, కిసాన్ సెల్ అధ్యక్షుడు భూక్య రవి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular