అక్రమ నీటి కనెక్షన్ ను తక్షణమే తొలగించాలి
కోదాడ,మే 14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణ పరిధిలోని శ్రీనివాస నగర్ కెఎల్ఎన్ ప్రసాద్ ఇంటి ప్రక్కన నుండి అక్రమముగా వేసిన బోరు కనెక్షన్ తొలగించుట గురించి మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం మంగళవారం అందించడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీనివాస నగర్ కాలనీవాసులు మాట్లాడుతూ
పట్టణంలోని శ్రీనివాసనగర్ ఏరియాలో కేఎల్ఎన్ ప్రసాద్ ఇంటి దగ్గరలో ఇంటి నిర్మాణం కొరకు బోరు వేసుకొని ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారు.కానీ వారు ఇంటి నిర్మాణముతో పాటు 400 మీరట్ల దూరములో ఉన్న వాటర్ ప్లాంట్ వారికి అక్రమముగా మోటార్ కనెక్షన్ ఇచ్చి,నీటిని అక్రమముగా ప్లాట్ వారికి తరలిస్తున్నారు.ఈ విధముగా నిత్యం చేయడం వలన అట్టి ప్రదేశములో యున్న మిగిలిన నివాస గృహముల వారి బోర్లు ఎండిపోయి త్రాగు నీటి ఎద్దడి కలుగుతున్నది.లక్షల రూపాయలు పెట్టి వేసిన బోర్లు ఎండిపోవడముచే అట్టి నివాస గృహముల వారి ఇండ్ల నందు నివసించే వారికి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది.కావున తమరు సదరు విషయమును పరిశీలించి సదరు ఇంటి నుండీ వేసిన అక్రమ నీటి కనెక్షన్ కూడా తొలగించగలరని మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం అందించడం జరిగిందని కాలనీవాసులు తెలిపారు.



