కోర్టు భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని మంత్రికి వినతి.
కోదాడ,మే 14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సూర్యాపేట జిల్లా కోదాడ లో నూతన కోర్టు భవన నిర్మాణ పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కోదాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎం ఎల్ ఏ పద్మావతి లకు పలువురు న్యాయవాదులు విన్నవించారు.కోదాడ లో గతంలో 2 కోర్టు లు వుండగా,మరో రెండు కోర్టు లు ఏర్పాటు చేశారని,మొత్తం 4 కోర్టులు పని చేస్తున్నాయని న్యాయవాదులు వారికి తెలిపారు.కోదాడలో 5 కోర్టుల భవన నిర్మాణానికి గత ఫిబ్రవరి22న శంకుస్థాపన జరిగిందని,నిర్మాణ పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదని వారి దృష్టికి తీసుకు వచ్చారు.దీనికి స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత నిర్మాణ పనులపై దృష్టి సారించి,పనులు వేగవంతం అయ్యేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.మంత్రిని కలిసిన వారిలో సీనియర్ న్యాయవాదులు చింతకుంట్ల లక్ష్మినారాయణ రెడ్డి,మేకల వెంకట్రావు,బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల రామిరెడ్డి,న్యాయవాదులు ఈదుల కృష్ణయ్య,చల్లా కొండల్ రెడ్డి,ముల్కా వెంకట్ రెడ్డి,కే ఎల్ ఎన్ ప్రసాద్,బండి వీరభద్రం తదితరులు ఉన్నారు.



