విద్యుత్ షాక్ కు గురై రెండు గేదలు మృతి
చిలుకూరు,మే 15(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:విద్యుత్ షాక్ కు గురై పాడి గేదెలు మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.వివరాలలోకి వెళితే మండల పరిధిలోని ఆచార్యులగూడెంలో గ్రామానికి చెందిన మునగాల సైదిరెడ్డి పాడి గేదెలు రోజువారీగా మేతకు అడవికి వెళ్లాయి.కాగా ఆరోజు రాత్రి ఇంటికి రాకపోవడంతో రాత్రి అంతా గ్రామములో చుట్టుపక్కల వెతికారు. మరుసటి రోజు ఉదయం వెతుకుచుండగా గ్రామ శివారులోని పొలాలలో విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందినట్లుగా గుర్తించారు.చనిపోయిన గేదెల విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని బాధిత రైతు తెలిపారు.సంబంధిత విద్యుత్ శాఖ వారు శాఖాపరంగా ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరారు.గత కొద్ది రోజుల నుండి ఈదురుగాలులు వీస్తునడంతో పొలాలలో ఉన్న కరెంటు తీగలు కిందపడి పోవడం వలన సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వాటిని గమనించకుండా ఉండటం వలన ఏమీ తెలియని మూగజీవాలు మేతకని వెళ్లి ఆ విద్యుత్తు షాక్ కు గురై బలైవుతున్నాయి.కావున సంబంధిత అధికారులు అలాంటి వాటిని గమనించి తక్షణమే పరిష్కార మార్గాలు చూపినట్లయితే మూగజీవాలను కొంతమేర కాపాడవచ్చని పలువురు వాపోతున్నారు.



