బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
:ఆయన యొక్క రాజ్యాంగ ఫలాలను ప్రతి పేదవారికి అందేలా చూడాలి.
:డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బల్గూరి దుర్గయ్య.
హుజూర్ నగర్,మే 16(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:చింతలపాలెం మండల పరిధిలోని రేపల్లె గ్రామంలో గురువారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం గ్రామస్తులు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బల్గూరి దుర్గయ్య (ఏఏఈ) పాల్గొని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ విద్య ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని,జీవితాంతం అధ్యయనాన్ని కొనసాగించి భారతదేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించి దళిత,బడుగు,బలహీన వర్గాల అందరి జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని తెలిపారు.ఈ దేశంలోని నిమ్న వర్గాల అభివృద్ధి కోసం తన కడుపున పుట్టిన కుమారులు చనిపోయినప్పటికీ విద్యను కొనసాగించి ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ సమానత్వంతో స్వేచ్ఛగా జీవించే విధంగా అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగంలో హక్కులు కల్పించారని అన్నారు.కావున ఆ మహనీయుని రచనలను అధ్యయనం చేసి ఆయన ఆశయాలను కొనసాగించాల్సిందిగా యువకులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాతంగి ప్రభాకర్ రావు,కోట స్టాలిన్,గంధం బుచ్చారావు,అంబేద్కర్ యూత్ సభ్యులు,గ్రామస్తులు,పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



