Sunday, December 28, 2025
[t4b-ticker]

కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలపై ఫిర్యాదులు నిరాధారం

కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలపై ఫిర్యాదులు నిరాధారం

యాజమాన్యం పై కక్ష సాధింపు కోసమే ఆరోపణలు

గ్రామీణ ప్రాంత విద్యార్థినిలకు విద్యనందిస్తున్న కళాశాలకు అనుమతులు ఇవ్వండి:జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహా రెడ్డి గ,రిజిస్ట్రార్ కే వెంకటేశ్వర్లు లకు వినతి పత్రం అందజేసిన ఎల్ హెచ్ పిఎస్ నాయకులు

కోదాడ,మే 17(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలపై కొందరు వ్యక్తులు చేసిన ఫిర్యాదులు నిరాధారం అని ఎల్ హెచ్ పిఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోట్యా నాయక్,రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు నాయక్ లు అన్నారు.శుక్రవారం హైద్రాబాద్ లో జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్,రిజిస్టార్ లకు కళాశాలకు ఎఫ్ఎఫ్ సీ బృందం సందర్శన,2024-25 విద్యాసంవత్సరానికి అనుబంధ గుర్తింపు ఇవ్వాలని వినతి పత్రం అందజేసి విసి,రిజిస్ట్రార్ ల దృష్టి కి పలు అంశాలను తీసుకెళ్లారు.గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల బాలికలకు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్న ఏకైక కళాశాల కిట్స్ కళాశాల అని తెలిపారు.ఉద్దేశ పూర్వకంగా యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నాయకుడిగా చలామణి అవుతున్న వ్యక్తి గ్రామీణ ప్రాంతా విద్యార్థులు చదివే కళాశాల కు అనుమతులు రాకుండా ఫిర్యాదులు చేశాడని తెలిపారు.బేటి పడావో బేటి బచావో అనే నినాదానికి అనుగుణంగా కళాశాల బాలికలకు ప్రమాణాలతో కూడిన విద్యానందిస్తుందన్నారు.కళాశాల యాజమాన్యం ఎంతోమంది పేద విద్యార్థినిలకు విద్యతో పాటు ఉచిత వసతి కూడా కల్పించిందని చెప్పారు.కళాశాల నుండి వందలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యాలభ్యసించి ఉన్నత లక్ష్యాలకు చేరుకున్నారని తెలిపారు.వ్యక్తిగత కారణాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని వారి ఆరోపణలు పరిగణలోకి తీసుకోకుండా కళాశాల కు క్లీన్ చీట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.లేని పక్షంలో తమ గిరిజన బడుగు బలహీన వర్గాల ఆడ పిల్లలు వందలాది మంది నష్ట పోతారని తెలిపారు.కళాశాలలో చదివే విద్యార్థులకు అండగా ఎల్ హెచ్ పి ఎస్ ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు రవి నాయక్,నియోజకవర్గ అధ్యక్షులు నాగేశ్వరరావు నాయక్ లు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular