బాప్టిస్ట్ చర్చిలో ఎంసెట్లో ర్యాంక్ సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం
కోదాడ,మే 19(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక బాప్టిస్ట్ చర్చి ఆవరణంలో పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో ఇటీవల వచ్చిన ఎంసెట్ రిజల్ట్ లో కోదాడ బాప్టిస్ట్ సంఘానికి చెందిన విద్యార్థులు మంచి ర్యాంక్ సాధించారు.వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేసి విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఎదగాలని తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులను,తల్లిదండ్రులను సంఘమంతా అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపాలిటీ క్రిస్టియన్ కోఆప్షన్ సభ్యురాలు వంటేపాక జానకి యేసయ్య,బొల్లికొండ కోటయ్య,జగ్గు నాయక్,జాన్,మోజస్,రాంబాబు,వినయ్,మంజు,రాకేశ్,జీవని, తదితరులు పాల్గొన్నారు.



