Sunday, December 28, 2025
[t4b-ticker]

తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ శ్రీరామరక్ష:మాజీ మంత్రి,ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ శ్రీరామరక్ష:మాజీ మంత్రి,ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాలతో అధికారమునకు వచ్చి ప్రజలను మోసం చేసింది:ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

బ్లాక్ మెయిల్ కావాలో రైతు బిడ్డ
విద్యావంతుడు కావాలో ఆలోచించండి:డా,, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలి:మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా: ఏనుగుల రాకేష్ రెడ్డి

కోదాడ,మే 20(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ప్రశ్నించే గొంతుక అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించేవాడు కాదని మంచి విద్యావంతుడు బిట్స్ బిలానీలో చదువుకున్న రైతు బిడ్డ ఏనుగు రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసనమండలి సభకు పంపించినట్లయితే పట్టబద్ధుల తరఫున ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డి అవుతారని మాజీమంత్రి జగదీశ్వర్ రెడ్డి,మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.ఆదివారం పట్టణంలోని స్థానిక గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కోదాడ నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి,ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి,జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి,మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డి,మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ కటకం సత్తయ్య గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తికి దీటైన వ్యక్తి జవాబు ఇచ్చే సమయం వచ్చిందని ఆయన తెలిపారు.

నిరుద్యోగులు విద్యావంతుల పక్షాన ప్రశ్నించే గొంతుకు రాకేష్ రెడ్డి కావాలని అందుకు ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టబద్ధులంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోడీని మోసాలపై ప్రశ్నించే వ్యక్తి ప్రస్తుతం కావాలని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని తెలిపారు.ఎన్నికల్లో నమ్మించి మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినా పరవాలేదు కానీ, గత టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులు కొనసాగించలేని దుస్థితిలో రేవంత్ ప్రభుత్వం ఉన్న విషయాన్ని నిరుద్యోగులు,ఉద్యోగులు,రిటైర్డ్ ఉద్యోగులు గమనించి తగిన తీర్పు ఇవ్వాలని కోరారు.

కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు ఆకలి సావులు తో చావలేదని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసిఆర్ శ్రీరామరక్ష అని తెలిపారు.అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి బడుగుల లింగయ్య యాదవ్ ప్రవీణ్ కుమార్ బొల్లం మల్లయ్య యాదవ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏనుగు రాకేష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి కేసిఆర్ కు బహుమతిగా ఇవ్వాలని పట్టబద్రులను కోరారు.ఈ సమావేశంలో గ్రంధాలయ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్,చింతా కవిత రాధారెడ్డి,మేదర లలిత,మామిడి రామారావు,బెజవాడ శ్రావణ్,షేక్ నయీమ్,కుక్కడుపు బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular