బలమైన సంకల్పమే విజయానికి పునాది:కే నాగేందర్
కోదాడ,మే 20(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:బలమైన సంకల్పంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టపడి చదివినట్లయితే విజయానికి పునాదులు వేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ సంఘ సభ్యులు,అసిస్టెంట్ కమిషనర్ కే నాగేందర్ అన్నారు.సోమవారం పట్టణంలోని ఎమ్మెస్ కళాశాలలో అంబేద్కర్ ఆశయ సాధన ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు గట్టి సంకల్పంతో ఐదు ఆరు సంవత్సరాలు బాగా కష్టపడితే భవిష్యత్తు అంతా బంగారమయం అవుతుందని అన్నారు.ఎంట్రన్స్ టెస్ట్ కు వెళ్లే పిల్లలు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా మనోధైర్యంతో వెళ్లి ఎంట్రన్స్ ను చక్కగా రాసి మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు.

అంబేద్కర్ ఆశయ సాధన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించి కోచింగ్ నిర్వాహకులకు,తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని అన్నారు.ఐదు సంవత్సరాల నుండి ఎంతోమంది పేద విద్యార్థలకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్న ఆస్క్ సంస్థను ఆయన అభినందించారు.అనంతరం తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ తరపున ఆస్క్ సంస్థకు కొంత ఆర్థిక సహాయాన్ని అందించినారు.ఆస్క్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు కే నాగేందర్,జీఎస్టీ ఏసిటిఓ రవీందర్ బాబును ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో అస్క్ అధ్యక్షులు బలుగూరి స్నేహ దుర్గయ్య,ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్ రావు, కోర్సు డైరెక్టర్ శౌరి,ఫ్యాకల్టీ చెరుకుపల్లి కిరణ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు..



