అమరబోయిన గోపి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఆస్క్ నిర్వాహకులు
కోదాడ,మే 22(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం(ఆస్క్) కోదాడ ఆధ్వర్యంలో నిర్వహించే పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ ముగింపు సందర్భంగా కీ.శే. అమర బోయిన గోపి రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి సంస్మరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అనంతరం ఆస్క్ నిర్వాహకుల ఆధ్వర్యంలో గోపి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో ఆస్క్ వ్యవస్థాపకులు బలుగూరి దుర్గయ్య,ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్ రావు,కోర్స్ డైరెక్టర్ యలమర్తి శౌరి,బొడ్డు హుస్సేన్,నందిపాటి సైదులు,పిడమర్తి వెంకటేశ్వర్లు,అమరబోయిన వెంకటరత్నం,కోర్స్ కో-ఆర్డినేటర్ గంధం బుచ్చరావు,నంది పాటి సుధాకర్,చెరుకుపల్లి కిరణ్,అమరబోయిన పుష్పమ్మ,కలకొండ సైదులు,కలకొండ ప్రమోద,కే శ్రీకాంత్,కే కన్నయ్య,షరీఫ్,నటరాజు,త్రివేణి,విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



