మహేశ్వర్ రెడ్డివి దుర్మార్గపు, నిరాధారణ ఆరోపణలు: ఆలేటి రాంబాబు
రాజకీయ లబ్ధి కోసమే ఉత్తమ్ పై ఆరోపణలు..
కోదాడ,మే 23(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మంత్రి ఉత్తమ్ పై యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన అసత్య ఆరోపణలను కోదాడ కాంగ్రెస్ యువ నాయకుడు ఆలేటి రాంబాబు ఖండించారు. కోదాడ పట్టణంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నిస్వార్ధంగా, నీతి, నిజాయితీతో ప్రజలకు సేవ చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పై రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారన్నారు. సైన్యంలో సైనికుడిగా పనిచేసి ప్రజాసేవ కోసం ప్రజాక్షేత్రంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, రెండుసార్లు మంత్రిగా మచ్చలేని నాయకుడిగా ఉత్తమ్ కు పేరు ఉందన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే నిందలు వేస్తున్నారని విమర్శించారు. నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.



