ఉత్తమ్ నిజాయితీని శంకించే అర్హత ఎవరికి లేదు
కోదాడ,మే 23(mbmteugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నిజాయితీకి నిలువెత్తు రూపమైన భారీ నీటిపారుదల , పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నిజాయితీని శంకించే హర్హత రాష్ట్రంలో ఏ ప్రతిపక్ష నాయకుడు లేదని తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయపూడి వెంకటనారాయణ అన్నారు. గురువారం పట్టణంలో రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ సభ్యురాలు రాజ్యలక్ష్మితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపి ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అన్నారు . మరోసారి ఉత్తంకుమార్ రెడ్డి పై ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆయన ఘాటుగా విమర్శించారు . గత 30 ఏళ్లుగా ఉత్తమ్ దపతులు కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా అభివృద్ధి లక్ష్యంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నారని అన్నారు. రెండు నియోజకవర్గాల ప్రజలే తమ బిడ్డలుగా భావిస్తూ నిజాయితీగా ఉంటూ ప్రశాంత వాతావరణంలో ఆదర్శమైన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.



