గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి: జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు:పి కళ్యాణ్ బాబు
కోదాడ,మే 23(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:వేసవి ప్రాంతంలో వేసవి వాలీబాల్ క్రీడా శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు పి కళ్యాణ్ తెలిపారు.స్థానిక చిమిర్యాల గ్రామంలో నిర్వహించిన వాలీబాల్ శిక్షణ కార్యక్రమానికి కోదాడ పట్టణానికి చెందిన చలిగంటి రామారావు,గన్నపురెడ్డి నాని,సూరపల్లి భాను ప్రకాష్ లు హాజరై శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు క్రీడా సామాగ్రి,పండ్లు అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ వేసవి ఉచిత శిక్షణ శిబిరంలో 20రోజుల పాటు వాలీబాల్ క్రీడలు నిర్వహించినట్లు తెలిపారు.విద్యార్థులు ప్రతి రోజు వ్యాయామం చేయాలని సూచించారు.దీంతో క్రమశిక్షణ అలవాటు పడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో చిమిర్యాల యువ చైతన్య యూత్ సభ్యులు మురళి,సన్నీ,కళ్యాణ్,యాకోబ్,నాగచైతన్య,నాగ పృద్వి,సిసింద్రీ,రవి, కిరణ్,బన్ను తదితరులు పాల్గొన్నారు.



