Sunday, December 28, 2025
[t4b-ticker]

మట్టి మాఫియా చేతికి చెరువు మట్టి

మట్టి మాఫియా చేతికి చెరువు మట్టి

:రైతులకి తోలకుండా వెంచర్లకి అమ్ముకుంటున్న మట్టి మాఫియా

:ఎవరైనా ఇదేంటని ప్రశ్నిస్తే మేము రైతులకే తోలుతున్నామని నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు

:చెరువులో పూర్తి మొత్తంలో నీరు పోవడం వలన విరుచుకుపడుతున్న మట్టి మాఫియా

:ఆరు జెసిబిలు 150 ట్రాక్టర్లతో చెరువు మట్టి పక్కదారి

:పట్టించుకోని సంబంధిత అధికారులు

:అధికారులకు భారీ మొత్తంలో ముట్ట చెబుతున్నామని మట్టి మాఫియా వారు బాహాటంగానే చెప్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కోదాడ,మే 24(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణ పరిధిలోని తమ్మర బండపాలెం కు ఆయ పట్టువైన చెరువును సైతం వదలకుండా మట్టి మాఫియా దళారులు పట్టపగలు,రాత్రి సమయంలో విచ్చలవిడిగా చెరువులు మట్టిని ఇతర సొంత అవసరాలకు తరలిస్తున్న సంబంధిత అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరించడం ప్రజలలో ఆశ్చర్యానికి గురిచేస్తుంది.కోదాడ పట్టణ పరిధిలోని తమ్మర బండపాలెం పరిధిలోని చెరువు గత పది రోజుల నుండి అదే గ్రామానికి చెందిన కొందరు 6 జెసిబిలు 150 ట్రాక్టర్లను పెట్టి చెరువులో మట్టి తీసి రైతులకు పంపించాల్సిన మట్టిని రియల్ ఎస్టేట్ లకు,ఇటుక బట్టీలకు పంపి డబ్బులు దండుకుంటున్నారు.గ్రామాలలో మట్టి గుట్టలను కొల్లగొట్టారు గ్రామాలలో ఇక మట్టి దొరికే పరిస్థితి లేదు ఇంతలోనే కాలం కాకపోవడం చెరువుల ఎండిపోవడంతో మట్టి మాఫియా చేతికి చెరువు మట్టి పోవడంతో చెరువులో భారీ ఎత్తున గుంటలు పెట్టి మట్టిని తరలిస్తున్నారు.ముందుగా రైతులకని చెప్పి జెసిబిలు ట్రాక్టర్లు చెరువులోకి దిగినాక రైతులకు పంపించాలని మట్టి రియల్ ఎస్టేట్ ల వెంచర్లకు పంపుతున్నారు.

వెంచర్ లో మట్టిని కార్చుతున్న ట్రాక్టర్లు

ఎవరైనా ఇదేంటని ప్రశ్నిస్తే మీకు సంబంధం ఏంటి మేము రైతులకి తోలుతున్నాము అనే నిర్లక్ష్యం సమాధానం చెబుతున్నారు. చెరువులో పూర్తిస్థాయిలో నీరు పోవడం వలన మట్టి మాఫియా వారికి చాలా సులువుగా మట్టిని వెంచర్లకు తోలటానికి ఉపయోగపడుతుంది.సంబంధిత ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అవడం లేదని రెస్పాండ్ అయిన నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఇదే మట్టి మాఫియా వారు గ్రామంలో డెవలప్మెంట్ కి మట్టిని తోలమంటే తోలర్ కానీ వెంచర్ల కైతే భారీ మొత్తంలో డబ్బులు వస్తాయని తోలుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. సంబంధిత అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు చెల్లిస్తున్నామని మట్టి మాఫియా వారు బాహాటంగానే చెబుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రామంలో చెరువు మట్టిని వెంచర్లకు తరలిస్తే రేపు గ్రామంలో ప్రజలకు గృహ అవసరాలకు ఇంకా ఇతరత్రా అవసరాలకు మట్టి దొరకటం చాలా కష్టంగా ఉంటుందని ప్రజలు అంటున్నారు.ఇకనైనా సంబంధిత అధికారులు చెరువు మట్టిని వెంచర్లకు తరలిస్తున్న జెసిబి లు టాక్టర్లపై తగు చర్యలు తీసుకొని చెరువు మట్టిని రైతులకు తోలే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు వాపోతున్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular