క్రీడలు మానసిక ఉల్లాసానికి ద్రోహదపడతాయి:కౌన్సిలర్ మేదర లలిత
కోదాడ,మే 25(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:క్రీడలో మానసిక ఉల్లాసానికి ఎంతో ధ్రువత పడి విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండటానికి క్రీడలు ఉపయోగపడతాయని 35 వ వార్డు కౌన్సిలర్ మేదర లలిత అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల గ్రామంలో వేసవి ఉచిత వాలీబాల్ శిక్షణన శిబిరాన్ని ఆమె శనివారం సందర్శించినారు.అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని క్రీడలలో చదువులలో రాణించాలని విద్యార్థి దశలో శారీరకదారుఢ్యం పెంపొందించుకోవాలని మంచి అలవాట్లు అలవర్చుకోవాలని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు గ్రామానికి మంచి పేరు తీసుకుని రావాలని కొనియాడారు.

అదే విధంగా పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించారు.అనంతరం క్రీడాకారులందరూ కౌన్సిలర్ ని ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కోచ్ కళ్యాణ్ బాబు,క్రీడాకారులు పాల్గొన్నారు.



