ఘనంగా ఎన్టీఆర్ 101జయంతి వేడుకలు
చిలుకూరు,మే 28(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:చిలుకూరు మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు.రాజకీయ రంగంలో తనదైన శైలిలో ప్రజల ఆధర అభిమానాలు పొందడంతో పాటు రాష్ట్ర,జాతీయ రాజకీయాల్లో తెలుగు ప్రజలకు పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారని అన్నారు.రాజకీయాలకు వన్నె తెచ్చిన మహనీయుడని అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



