విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి
చిలుకూరు,మే 28(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మండల పరిధిలోని కట్టకొమ్మ గూడెం గ్రామంలో విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.బాధిత రైతు వేమూరు శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం రోజువారీగా మేత కోసం వెళ్లి విద్యుత్ షాక్ గురై మృతి చెందినట్లుగా తెలిపారు.మృతి చెందిన పాడి గేదె విలువ రూ.1లక్ష ఉంటుందన్నారు.



