భరతనాట్యం అరంగేట్రం శ్రీ తన్వీ నటరాజ్ డ్యాన్స్ స్కూల్
కోదాడ,జూన్ 03(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడలోని మన రామాలయంలో ఏకాదశి సందర్భంగా భరతనాట్యం అరంగేట్రం నృత్య ప్రదర్శన శ్రీ తన్వీ నటరాజ్ డ్యాన్స్ స్కూల్ నిర్వాహకులు నాట్య గురు తిరుపతి స్వామి శిష్య బృందం చేయడం జరిగింది.ఈ ప్రదర్శన భక్తులును ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా ప్రేక్షకులను అబ్బురపరిచే విధంగా చిన్నారులు నాట్యాన్ని ప్రదర్శించారు.గత రెండు సంవత్సరాలనుండి ఈ చిన్నారులు భరతనాట్యం లో నాట్య గురు తిరుపతి స్వామి నాట్యాలయం లో శిక్షణ తీసుకుంటూ వారి కోర్స్ ను కంప్లీట్ చేసి వారు నేర్చుకున్న నృత్యాన్ని మొట్ట మొదట దేవాలయంలో దేవుడు కి నృత్యార్చన చేయడమే నాట్య శాస్త్రం లో అరంగేట్రం అని నిన్న రామాలయం లో పదకొండు మంది చిన్నారులు అరంగేట్రం చేశారు.వీరితో పాటు సీనియర్ నాట్య చిన్నారులు నలుగురు పాల్గొన్నారు.మన రామాలయం పునరనిర్మాణం చేసిన తరువాత ఆ రామయ్య సన్నిధిలో తమ చిన్నారులు నాట్యం చేయడం ఎంతో మహాభాగ్యం అని నాట్య గురు తిరుపతి స్వామి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన రామాలయం నాగుబండి రంగా,లక్ష్మయ్యకి కృతజ్ఞతలు తెలియజేశారు.అదేవిధంగా ఎంతగానో సహకరించిన రామాలయం పూజారులందరికి నమస్కారాలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో చిన్నారులు తల్లితండ్రులు తమ చిన్నారులు నాట్యంచూసి వారి ఆనందానికి అవధులు లేవు ఇంత గొప్ప గా చిన్నారులుకు నాట్యం నేర్పించి ప్రదర్శన చేపించన నాట్య గురువు తిరుపతి స్వామికి సన్మానం తో సత్కరించారు.అదేవిధంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ నాట్యం చూసిన భాగ్యం కల్పించిన గురువుకి తమ అభినందనలు తెలియజేశారు.అరం గేట్రం చేసిన నాట్య చిన్నారులు శ్రేష్ఠ,శ్లోక,హాసిని,సాన్విక,అధ్య,తపస్య,యువాన్ష,హృతిక,ద్యుతి,నాగనిత్యశ్రీ,జెనిలా ఈ చిన్నారులకు సహకరించిన సీనియర్ నాట్య చిన్నారులు ఉమా శ్రావణి,సాన్విక,కుసుమ,లౌక్య కార్యక్రమం అనంతరం పూజారులు నాట్య గురు తిరుపతి స్వామికి నాట్య చిన్నారులకు ఆశీర్వచనాలు ఇచ్చారు.



