అఖండ విజయాన్ని చేకూర్చిన ప్రజా దీవెన….
5,52,659 మెజార్టీతో దేశంలోనే నల్లగొండ కీర్తి పతాక…
కాంగ్రెస్ గెలుపుతో హర్షం వ్యక్తం చేసిన టిపిసిసి కోదాడ కోశాధికారి గరినే శ్రీధర్…
కోదాడ,జూన్ 04(mbmtelugunews)ప్రతినిధి మతంగి సురేష్:నల్లగొండ పార్లమెంటు స్థానంలో కుందూరు రఘువీర్ రెడ్డికి అఖండ విజయాన్ని అందించి, 5 లక్షల 52,659 పైచిలుకు మెజార్టీతో దేశంలోని నల్లగొండని కీర్తి ప్రతీకగా నిలిపిన నల్లగొండ ప్రజలను అభినందిస్తూనట్లు కోదాడ పట్టణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోశాధికారి, మాజీ ఎంపీపీ గరినే శ్రీధర్ తెలిపారు. రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి, కుందూరు జానారెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి గార్ల పర్యవేక్షణలో నల్లగొండ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అభిమానులు శక్తి వంచన లేకుండా పనిచేసే అఖండ విజయాన్ని చేకూర్చారని, రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపించి ఎంతో అభివృద్ధి చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషి నేడు ఓట్ల రూపంలో ఇంత మెజార్టీని సాధించిందన్నారు. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గం 2 లక్షలకు పైగా మెజార్టీ అందించి హుజూర్నగర్ కోదాడ కాంగ్రెస్ అభిమానులు నాయకులు మరోసారి తమ చత్తా చాటారని, వారందరికీ అభినందనలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిక్షణం పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.



