రైతులు వాటర్ త్రాగడం కొరకు రెండు చల్లటి వాటర్ కూలర్స్ ఏర్పాటు
కోదాడ,జూన్ 13(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఏఎంసీ కోదాడ నందు రైతులకు త్రాగునీరు అవసరాల నిమిత్తం చల్లటి వాటర్ కూలర్స్ ను ఏర్పాటు చెయ్యడం జరిగిందని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి అశోక్ అన్నారు.అదే విధంగా ఈ కూలర్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరూపయోగంగా ఉన్న ఇనుప సువ్వలతో వెల్డింగ్ చేయించి గది లా ఏర్పటు చేయడం జరిగిందని అన్నారు.అంతే కాకుండా మిగిలి ఉన్న ఇనుప సువ్వలతో ఇన్కమింగ్ గది కి గేట్ కూడా తయారు చేయించడం జరిగిందని అన్నారు.వ్యవసాయ మార్కెట్ కమిటీకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.



