చిలుకూరు తహసిల్దార్ నకు వినతి పత్రం అందజేస్తున్న రైతులు
చిలుకూరు,జూన్ 14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మండల పరిధిలోని చెన్నారి గూడెం గ్రామ శివారులోని చెరువు దగ్గర గల బండ వద్ద తమ భూమిని కొంతమంది అక్రమంగా ఆక్రమణ చేసుకోని మట్టి పోయాలని చూస్తున్నారని తక్షణమే అలాంటి వారిపై తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధిత రైతులు శుక్రవారం తహసిల్దార్ ధ్రువకుమార్ కు వినతిపత్రాన్ని అందజేశారు.తమకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాదారు పాసుపుస్తకం ఉన్నదని అయినను కావాలనే గ్రామానికి చెందిన కొందరు దౌర్జన్యంగా ఆక్రమణ చేస్తున్నారని విన్నవించారు.ఈ విషయంపై విచారణ చేసి తమకు తగిన న్యాయం చేయాలని కోరారు. తహసిల్దార్ ధ్రువకుమార్ తక్షణమే స్పందించి విచారణ చేస్తామన్నారు.



