పదోన్నతి పొందిన జీహెచ్ఎం లకు సన్మానం
చిలుకూరు,జూన్ 24(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్కూల్ అసిస్టెంట్ లుగా ఉండి జిహెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి పొందిన పలువురు జనపనేని రామారావు,మాగి గురవయ్య,కె రామిరెడ్డి లను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జెర్రిపోతుల గూడెం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల విషయంలో ఐక్య ఫెడరేషన్ కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు అచ్యుత జనార్దన్ రావు,చిలుకూరు మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు అన్నెపంగు బచ్చయ్య,నక్క శ్రీనివాస్,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



