ఆంధ్రప్రదేశ్:: విజయనగరం జిల్లా(mbm telugu news ప్రతినిది శోభన్ బాబు) ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా విజయదుర్గ యూత్ సొసైటీ మరియు విజయనగరం యూత్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదిత్య డిగ్రీ కళాశాల సహకారంతో స్థానిక విజయ బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. మీ రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా 32 మంది యువతి యువకులు రక్తదానం చేయడం జరిగింది వారికి రక్తదానం గురించి అవగాహన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయ్ దుర్గా యూత్ సొసైటీ చైర్మన్ కేశవపట్నం చంద్రిక, మరియు విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్షులు షేక్. ఇల్తమాష్, ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ దామోదర్ రావు, చెన్నారావు మాస్టర్, మరియు రాయల్ క్యాబ్స్ శరత్, రఘు, విజయ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ పుణ్యమంతుల శివ ఆదిత్య కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఘన సన్మానం చేయడం జరిగింది.
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం., విజయనగరం యూత్ ఆధ్వర్యంలో…
RELATED ARTICLES