పిడుగుపాటుకు వ్యక్తి మృతి
కోదాడ,జూన్ 14 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందిన సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని గుడిబండ రోడ్డుకు సమీపంలో చోటు చేసుకున్నది.మృతుడు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం పొందూరు రామారావు (52) గత 20 సంవత్సరాల నుండి గేదెల మేపుకుంటూ పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.పొందూరు రామారావు సొంత గ్రామం నల్లబండగూడెం గత 30 సంవత్సరాల క్రితం గుడిబండ రోడ్డు లోనే భవాని నగర్ కోదాడలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు.రోజు మాదిరిగానే శుక్రవారం నాడు మేతకు గుడిబండ రోడ్డు సమీపంలో గేదెలను తోలుకొని వెళ్ళినాడు.సుమారు మూడు గంటల సమయంలో వర్షం పడుచుండగా గేదెలను తోలుకొని ఇంటికి వద్దామనుకునే సమయంలో ఒక్కసారిగా మెరుపులు రావడంతో పిడుగు పడి రామారావు అక్కడికక్కడే మృతి చెందినారు. రామారావుకు ఒక కూతురు ఒక కుమారుడు కలరు ఇద్దరికీ వివాహమైనది.ఆ ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.



