దాతృత్వాన్ని చాటుకున్న అంబేద్కర్ యూత్ సభ్యులు
గరిడేపల్లి,జూన్ 14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండల పరిధిలోని పొనుగోడు గ్రామంలో అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు అయినటువంటి మునగలేటి లక్ష్మణ్ తల్లి మునగలేటి వెంకటమ్మ గత కొద్దిరోజుల క్రితం మరణించి. శుక్రవారం దశదినకర్మ సందర్భంగా అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వారి కుటుంబానికి 4000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



