తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ చిరు సత్కారం
సూర్యాపేట,జూన్ 16 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నూతనంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన తేజస్ నందలాల్ పవర్ ని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం సూర్యాపేట జిల్లా మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం తెలియజేసి సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేక్ జానీమియా,దున్నా శ్యామ్ మాట్లాడుతూ గత జిల్లా కలెక్టర్ కి ఏ విధంగా సహకరించామో అదేవిధంగా నూతనంగా విచ్చేసిన కలెక్టర్ కి సంపూర్ణ సహకారాన్ని అందించి ప్రభుత్వ పథకాలని క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబానికి అందే విధంగా కృషి చేస్తామని,సూర్యాపేట జిల్లా సమగ్ర అభివృద్ధికి పాటుపడుతామని తెలిపారు.కలెక్టర్ కి శుభాకాంక్షలు తెలిపిన వారిలో నాయిని ఆకాష్ వర్మ,,కే శేఖర్,మడిపడగా సైదులు,రాజేష్,శివలింగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



