ప్రైవేటు పాఠశాలలు,కళాశాలలో ఫీజలు బాదుడే బాదుడు:పందిటి నవీన్ కుమార్ మాదిగ
:ఫీజుల నియంత్రణేది కార్పొరేట్ దోపిడిని అడ్డుకునేది ఎవరు?
:విద్య హక్కు చట్టం 2009 అమలు జాడేది?
కోదాడ,జూన్ 17(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ట్యూషన్ ఫీ అంటు నగదు వసుళ్ళకు పాల్పడుతు తల్లిదండ్రుల జోబులకు కన్నం వేసే పనిలో నిమగ్నమైన కార్పొరేట్ పాఠశాలలపై సంబంధిత అధికారుల నిఘా కరువైందని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా కన్వీనర్ పందిటి నవీన్ కుమార్ మాదిగ అన్నారు.2009 విద్య హక్కు చట్టం అమలు పరచడంలో సంబంధిత అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు.పుట్టగోడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు పాఠశాలపై పర్యవేక్షణ లోపంతో యథేచ్చగా అక్రమ దందాకు పాల్పడుతున్న యాజమాన్యాలు.బయటకు చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతున్న తల్లిదండ్రులు. విధ్యా శాఖ మౌనం వెనుక దాగి ఉన్న ఆగాందం దేనికి సంకేతాలో సంబందిత జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులకే తెలియాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా కన్వీనర్ పందిటి నవీన్ కుమార్ మాదిగ అన్నారు.



