విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరీల్లు దగ్ధం.
కోదాడ,జూన్ 18(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మర గ్రామంలో నీ సుందరయ్య కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరీలు దగ్ధమైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తమ్మర గ్రామానికి చెందిన మొగిలి వెంకన్న తన కుటుంబ సభ్యులతో సుందరయ్య కాలనీలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చలరేగడంతో పూరి గుడిసె మొత్తం బూడిదయింది. ఇంట్లో ఉన్న సామాన్లు,ఇటీవల గొర్రెలు అమ్మగా వచ్చిన 4 లక్షల రూపాయలు,టీవీ,మూడు తులాల బంగారం,రెండు బీరువాలు దగ్ధమైనట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానికులు మంటలు ఆ ఆర్పే ప్రయత్నం చేశారు.ఇంట్లో నిండుగా రెండు గ్యాస్ సిలిండర్లు ఉండడంతో అంత భయపడ్డారు.ఆ ఇంటికి అనుకునే అంగన్వాడీ కేంద్రం కూడా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది అని స్థానికులు తెలుపు తున్నారు.విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది.హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.3వ వార్డు కౌన్సిలర్ సామినేని నరేష్ స్పందించి సంఘటన స్థలాన్ని పరిశీలించి వారికి న్యాయం చేస్తానని తెలిపారు.విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.అనంతరం రెవెన్యూ అధికారులు వెళ్లి పరిశీలించి సంఘటనకు గల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ 9666358480 కు పంపించగలరు.



