ప్రతిఒక్క కార్యకర్తకు అండగా ఉంటాం:దొంతగాని అప్పారావు గౌడ్
కోదాడ,జూన్ 18(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మండల పరిధిలోని కాపుగల్లు గ్రామ నివాసి అయినటువంటి దాచేపల్లి శీను తండ్రి సైదులు అనే వ్యక్తికి తమరబండపాలెం దగ్గర గత కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్ అయినది అది తెలుసుకున్న కాపుగల్లు బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ దొంతగాని అప్పారావు గౌడ్ వారికి ఆర్థిక సాయం 10000 రూపాయలు ఇవ్వడం జరిగినది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీను కుటుంబం ఎంతో పేద కుటుంబం శ్రీను పనికి వెళ్తేనే ఆ కుటుంబం నడవడం కష్టం అటువంటి వ్యక్తి మంచం మీద పడటంతో ఆ కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఆర్థికంగా ఎదుర్కొంటుందని అన్నారు.గ్రామంలో ప్రతి బిఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటానని అన్నారు.
మీ ప్రాంతంలో ఏవైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు



