వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు దామోదర రాజనర్సింహ కు పాలాభిషేకం చేస్తున్న వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ్..
కోదాడ,జూన్ 20(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ్ అన్నారు.గురువారం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో టివివిపి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ వెలుగు కరుణాకర్ అధ్యక్షత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమం లో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ పాల్గొని చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ చాలా కాలం నుండి వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నామన్నారు.వైద్య విధాన పరిషత్ ను రద్దు పరచి సెకండరీ హెల్త్ సర్వీసెస్ గా మార్చాలని,ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా జీతాలు ఇవ్వాలని కోరుచున్నామని అన్నారు.రిక్రూట్ మెంట్ అయినా కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలని,ఐదు అంచెల స్థాయిలో ప్రమోషన్స్ కల్పించాలని అన్నారు.ప్రతి జిల్లా కేంద్రంలో డిసిహెచ్ఎస్ కార్యాలయం లో తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలని,వైద్య విధాన పరిషత్ కు కేటాయించిన వైద్యశాలలకు, పడకల సంఖ్యను పెంచిన వైద్యశాలలకు క్యాడర్ స్ట్రేంతు ను ఇవ్వాలని వారు ఈ సందర్భంగా కోరారు.అన్ని క్యాడర్లకు ప్రమోషన్స్ ఇవ్వాలని,317 వ జీవో కింద అలాట్ మెంట్ అయినా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని,ఈ సమస్యలు చాలా కాలం నుండి వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను వేధిస్తున్నాయన్నారు.ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోకపోవడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులకు గురి అవుతున్నారు.ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము ఉద్యోగుల పట్ల సానుభూతితో సమస్యలు పరిష్కరించుటకు ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మాత్యులు చొరవ తీసుకొని మాకు న్యాయం చేస్తున్నందుకు మేమందరము వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.తొందర్లోనే ఈ అంశాలపై ప్రభుత్వం నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాము.మా పట్ల సానుభూతితో మా సమస్యలు పరిష్కరిస్తున్నందుకు ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రి కి పాలాభిషేకం చేశామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ మమత,హెడ్ నర్సు మంగమ్మ,ఇతర నర్సులు,మినిస్ట్రీయల్ స్టాప్ సతీష్ , రమేష్ ,శంకర్,ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



