భూ తగాదాలో అన్న పై తమ్ముడి దాడి
చిలుకూరు,జూన్ 22(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:భూ తగాదాల నేపద్యంలో గడ్డపారతో అన్నపై తమ్ముడు దాడి చేసిన ఘటన మండలంలోని నారాయణపురంలో శనివారం ఆలస్యంగా వెలులోకి వచ్చింది.బాధితుడు పధిర ధన మూర్తి తెలిపిన వివరాల ప్రకారం తాను పొలంలో సేద్యం చేస్తుండగా మా తమ్ముడు వీరబాబు అక్కడికి వచ్చి భూమి కొలతలలో తేడాలు ఉన్నాయని వాటిని తేల్చాలని ఘర్షణకు దిగాడు.దీంతో ఇరువురి మధ్య మాట మాట పెరిగి అందుబాటులో ఉన్న గడ్డపారతో అన్న పై దాడికి దిగాడు.దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి.బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాంబాబు గౌడ్ తెలిపారు.బాధితుడు ప్రస్తుతం వైద్యశాలలోనే చికిత్స పొందుతున్నాడు.



