నీట్ ని రద్దు చేసి రీ ఎగ్జామ్ నిర్వహించాలి
చిలుకూరు,జూన్ 22(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నీట్ పరీక్షను రద్దుచేసి తిరిగి పరీక్ష నిర్వహించాలని కోరుతూ కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బోయిళ్ల నవీన్ మాట్లాడుతూ ఈ దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్ పరీక్ష పత్రం లీకేజ్ జరిగిందని అన్నారు
నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని నీట్ అవకతవకలకు పాల్పడిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో ఎన్ టి ఏ గతంలోనిర్వహించిన అనేక పరీక్షల పైన అనుమానాలు ఉన్నాయి ఎన్ టి ఏపేపర్ లీకేజీ వల్ల పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే వ్యవహారం కనిపిస్తుందన్నారు.కావున ఎన్ టి ఏ ను ప్రక్షాళన లేదా రద్దు చేయాలి అన్నారు బిజెపి పాలిత ప్రాంతాలలో లీకేజీలు జరుగుతున్న ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ లీకేజీ పై నోరు విప్పడం లేదు అంతే కాదు నీట్ పరీక్షలు నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని తద్వారా విద్యార్థులకు న్యాయం జరుగుతుందని లేని పక్షంలో విద్యార్థులను యువకులను విద్యార్థుల తల్లిదండ్రులను సమీకరించి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వినోద్,జిల్లా నాయకులు జంగంపల్లి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.



