ఘనంగా గంగమ్మ జాతర
చిలుకూరు,జూన్ 23(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మండల కేంద్రం లోని పాత చిలుకూరులో గిరి పుత్రులు యాదవులు గంగమ్మ జాతరను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా మహిళలు బోనాలు వండుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.సాంప్రదాయ నృత్యంతో ఊరేగింపుగా బోనాలను అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లారు.దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,గిరి పుత్రులు తదితరులు పాల్గొన్నారు.



