కోదాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్
కోదాడ,జూన్ 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్.మంగళవారం కోదాడ పట్టణంలోని ఏరియా హాస్పిటల్ ఆకస్మిక సందర్శించారు.జనరల్ వార్డ్,ఎక్స్రే రూమ్,ప్రయోగశాలను పరిశీలించారు.ప్రతిరోజు ఎన్ని నమూనాలను సేకరించి రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారో కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.అక్కడ నుండి ఫార్మసీ కేంద్రాన్ని పరిశీలించి పేషెంట్లకు ఇస్తున్న మందులను పరిశీలించారు.

మందుల స్టాక్ వివరాలను రిజిస్టర్ ని పరిశీలించారు.ఎన్ని రకాల వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయో కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ వివరాలను సేకరించారు.డయాలసిస్ యూనిట్ ను పరిశీలించి రోజుకు ఎంతమంది పేషెంట్లకు డయాలసిస్ చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.ప్రసూతి వార్డును పరిశీలించి తొగర్రాయి గ్రామం నుండి వచ్చిన కొండపల్లి దీపిక ను,గొండ్రియాల గ్రామం నుండి డెలివరీ కి వచ్చిన మాగీ మేరీ ని ప్రసూతి సమయంలో అందించిన వైద్య సేవల గురించి వారిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.హాస్పిటల్ సిబ్బంది అందరూ మమ్ములను చాలా మంచిగా చూసుకున్నారని వారు కలెక్టర్ కు తెలిపారు.ఏరియా హాస్పిటల్ నందు నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరిగేలా చూడాలని కలెక్టర్ సూపరింటెండెంట్ కి తెలిపారు.హాస్పిటల్ లోని సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ్,మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్,ఆర్డిఓ సూర్యనారాయణ,తాసిల్దార్ సాయి గౌడ్,స్టాఫ్ నర్సులు జ్యోతి,ప్రసన్న, లక్ష్మి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.



