సికిల్ సెల్ ఎనీమియాను నివారించడమే లక్ష్యం
ఆత్మకూర్(ఎస్),(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సికిల్ సెల్ ఎనీమియా దినం సందర్భంగా మండలంలోని నెమ్మికల్ గిరిజన విద్యార్థి వసతిగృహంలో మంగళవారం విద్యార్థులకు రక్తపరీక్షల శిబిరాన్ని నిర్వ హించారు.జీవితాలను చక్కదిద్దు కుందాం.. సికిల్ సెల్ ను ఓడిద్దాం.. కలిసికట్టుగా నయం చేసుకుందాం అనే నినాదంతో ఆత్మకూర్ (ఎస్) మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ వీరేంద్రనాథ్ పాల్గొని మాట్లాడుతూ గిరిజనులలో ఎక్కువగా వంశపారంపర్యంగా ప్రతి నలుగురిలో ఒకరికి సికిల్ సెల్ లక్షణాలు వచ్చి రక్తహీనత ఉండే అవకాశం ఉందని తెలిపారు. అలాంటి వారిని తక్షణమే గుర్తించి సంబంధిత ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చి పరీక్షలు నిర్వహించి వారిని అనారోగ్యం బారిన పడకుండా కాపాడవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారిణి రేవతి, సీహెచ్ఓ ఆవుల వెంకటే శ్వర్లు,సూపర్వైజర్ రంగమ్మ,వార్డెన్ లింగయ్య,ఆరోగ్య కార్యకర్తలు కొండ్లె శ్రీను,పూలమ్మ,ధనమ్మ,ఆశా కార్యకర్తలు సంధ్య,మహాలక్ష్మి తదితరు పాల్గొన్నారు.