అంతర్జాతీయ మారకద్రవ్యాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి:సివిల్ జడ్జ్ ఎన్ శ్యాంసుందర్
కోదాడ,జూన్ 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణంలో గల ఎస్వీ కళాశాల సెమినార్ హాల్లో ఈరోజు అంతర్జాతీయ మారక ద్రవ్యాల నివారణ దినోత్సవం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కోదాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్ శ్యాంసుందర్ మాట్లాడుతూ మారకద్రవ్యాలు సేవించడం వల్ల మన శరీరం శక్తిని కోల్పోయి వాటికి బానిసగా మారడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని ఈ మారకద్రవ్యాలను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని,యుక్త వయసులో ఉన్న విద్యార్థిని,విద్యార్థులు చాలామంది గంజాయి గుట్కా మొదలగు మత్తుకు బానిసలు అవుతున్నారని కాబట్టి ప్రతి ఒక్కరూ డ్రగ్స్ సేవించడం వల్ల జరిగే అనర్థాలను తెలుసుకొని వాటి నివారణ చర్యలు పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కోదాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు,ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల రామిరెడ్డి,ఎస్వీ కళాశాల ప్రిన్సిపల్ ముత్తినేని సైదేశ్వర రావు,బార్ అసోసియేషన్ సభ్యులు సరికొండ హనుమంత రాజు,మంద వెంకటేశ్వర్లు,దొడ్డ శ్రీధర్,హేమలత,నాగుల్ పాషా,సీనియర్ న్యాయవాదులు ఎడ్లపల్లి వెంకటేశ్వర్లు,కోదండపాణి శ్రీనివాస్,మండల న్యాయ సేవాధికారిక సంస్థ సభ్యులు,కోర్టు సిబ్బంది,కళాశాల అధ్యాపకులు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.