Tuesday, July 8, 2025
[t4b-ticker]

:మాదక ద్రవ్యాలతో జీవితాల నాశనం……

:మాదక ద్రవ్యాలతో జీవితాల నాశనం……

:యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి…..
కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి…….
ఆర్డీవో సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి……

కోదాడ,జూన్ 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:గంజాయి,డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకై ప్రజలందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.బుధవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ నందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆర్డీవో సూర్యనారాయణ,డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ప్రజా,ప్రతినిధులతో కలిసి ర్యాలీని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారి వలన యువత పెడదారి పడుతుందని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న గంజాయి,డ్రగ్స్,మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.అనంతరం కాశీనాథం ఫంక్షన్ హాల్ లో కళాశాల విద్యార్థులకు ఎల్ఈడి స్క్రీన్ ద్వారా డ్రగ్స్ తీసుకుంటే కలిగే నష్టాలను వీడియోల రూపంలో చూపించారు.

డిఎస్పి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ యువత మత్తులో చిత్తు కావద్దని ఉన్నత లక్ష్యాలు పెట్టుకొని ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు.మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల జీవితం అంధకారం అవుతుందని మొబైల్ ఫోన్ వల్ల కలిగే నష్టాలు,డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు.డ్రగ్స్ మహమ్మారి నిర్మూలనకై కళాశాలల్లో,విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.మత్తు పదార్థాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ ప్రమాణం చేయించారు.మత్తు పదార్థాలు సేవించిన,విక్రయించిన చట్టరీత్యా నేరమని డ్రగ్స్ విక్రయించే వారిపై పోలీసులకు సమాచారం అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల,వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు,ఎంపీపీ మల్లెల రాణి,జడ్పిటిసి కృష్ణకుమారి,కోదాడ పట్టణ సిఐ రాము,రూరల్ సీఐ రజిత రెడ్డి,ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు,డివిజన్ విద్యాధికారి సలీం షరీఫ్,ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ వేముల వెంకటేశ్వర్లు,డాక్టర్ దశరథ,ఎస్ఐలు రంజిత్ రెడ్డి,అనిల్ రెడ్డి,నవీన్,రాంబాబు,మల్లేష్, మున్సిపల్ కౌన్సిలర్లు,డాక్టర్లు,న్యాయవాదులు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు………

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular