అగ్ని ప్రమాద బాధ్యత కుటుంబానికి నిత్యవసర సరుకుల పంపిణీ
కోదాడ,జూన్ 30(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన
పాస్టర్ యేసయ్య,కోదాడ మున్సిపల్ క్రిస్టియన్ కో ఆప్షన్ సభ్యురాలు
వంటెపాక జానకి యేసయ్య.స్థానిక తమ్మరబండపాలెం సుందరయ్య కాలనీలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో మొగులయ్య వీరమ్మ దంపతులకు చెందిన గుడిసె ప్రమాదవశాత్తు షాట్ సర్క్యూట్ వలన గుడిసెలో పాటు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలి బూడిద అయిన సంగతి తెలిసినదే.ఆదివారం బాధితులను కలసి పరామర్శించి వారికి కావలసిన నిత్యవసర వస్తువులు సహాయం చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ యేసయ్య దేవుడు వారిని వారి కుటుంబాన్ని కాపాడాలని ఇంకా ఎవరైనా దాతలు ఉంటే వారికి సహకరించాలని దీవించారు.ఈ కార్యక్రమంలో వారి వెంట మోజస్,రాంబాబు,విజయ,లక్ష్మి,మాధవి,అశ్విని,వరలక్ష్మి,ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు