అండర్ 17,15 బ్యాట్మెంటన్ సెలక్షన్లో కోదాడ ప్రభంజనం
కోదాడ,జూన్ 30(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఎల్డర్స్ రిక్రియేషన్ సొసైటీ ఇండోర్ స్టేడియం కోదాడలో కోచింగ్ పొందుతున్న క్రీడాకారులు మిర్యాలగూడలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో ఎం అభిరామ్ వర్మ అండర్ 17 లో విన్నర్ గా,ఎన్ అభిరామ్ అండర్ 17 లో రన్నర్ గా,ఏ సంతోష్,గౌతమ్ లు అండర్ 15 విభాగంలో డబుల్స్ విన్నర్ గా,ఏ సంతోష్ అండర్ 15 సింగిల్స్ లో రన్నర్ గా నిలిచారని సూర్యాపేట జిల్లా బ్యాట్మెంటన్ సెక్రటరీ తోట రంగారావు కోచ్ కాజా జలీల్ లు తెలిపారు.ఈ క్రీడాకారులు జులై 14 నుండి 17 వరకు మెదక్ లో జరగనున్న రాష్ట్రస్థాయి అండర్ 15 బ్యాట్మెంటన్ పోటీలలో పాల్గొంటారు.అదేవిధంగా అండర్ 17 విభాగంలో 23 నుండి 26 వరకు రాష్ట్రస్థాయి వరంగల్ లో జరగనున్న బ్యాట్మెంటన్ పోటీలలో పాల్గొంటారు అని తెలిపారు.గెలుపొందిన క్రీడాకారులను వీరేంద్ర వర్మ,కోచ్ నిసార్,ఫాజిల్ తదితరులు అభినందించారు.