గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:వేపూరి తిరుపతమ్మ సుధీర్
కోదాడ,జూన్ 30(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నడిగూడెంమండల మరియు పరిసర ప్రాంత రైతన్నలకు అమ్మలకు,అక్కలకు,అన్నలకు,యువకులకు,తల్లిదండ్రులకు విజ్ఞప్తి రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షం వల్ల విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు వైర్లు పూర్తిగా తడిచిపోయాయి కావున రైతు సోదరులు విద్యుత్ స్తంభాలను ట్రాన్స్ఫార్మర్లను మోటార్లను తొందరపాటున తాకకండి అదేవిధంగా పురాతనమైన శిధిలమైన భవనాలలో గోడల మధ్య ఎవరూ కూడా నివసించవద్దు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము వీధులలో ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలను ఇంటి పై నుండి వెళ్లిన విద్యుత్ వేర్లను గమనించి జాగ్రత్తలు పాటించాలని ప్రతి ఒకరికి విజ్ఞప్తి చేస్తున్నాము పైన తెలిపిన విషయాల పట్ల ఎవరికైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు గ్రామాల్లో ఉన్న పెద్దలకు సమాచార ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.మంచి పంటలు పండి ప్రతి ఒక్కరి కుటుంబాలలో సిరి సంపదలు సుఖసంతోషాలు కలిగి ఆనందంగాకలిసిమెలిసిసోదర భావంతో అభివృద్ధి సాధించాలని మనసారా ప్రార్థిస్తున్నాము చిన్నపిల్లలను రోడ్డు దాటించేటప్పుడు జాగ్రత్తగా గమనించాలని మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రు లకు విజ్ఞప్తి చేస్తున్నామని వేపూరి తిరుపతమ్మ సుధీర్ తెలిపారు.