జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం సమిష్టిగా పోరాడుదాం:అంజన్ గౌడ్
కోదాడ,జులై 02(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే (H – 143) సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కారింగుల అంజన్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.మంగళవారం కోదాడలో జరిగిన ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు.జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్న ప్రభుత్వం..ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు.

గతంలో పట్టాలు ఇచ్చిన జర్నలిస్టులందరికీ వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించాలని,జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజుల్లో రాయితీ ఇవ్వాలన్నారు.జర్నలిస్టుల హెల్త్ కార్డులు అన్ని ఆస్పత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.ఈ సమావేశంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు,ప్రధాన కార్యదర్శి గంధం వెంకటనారాయణ,కమిటీ సభ్యులు ఏబీఎన్ గాంధీ,జీ టీవీ కుడుముల సైదులు,హెచ్ఎంటివీ పూర్ణ,ఎన్టీవీ రాము,టీన్యూస్ లక్ష్మణ్,గుండు మధు,సైదులు,శ్రీకాంత్,మహముద్,కుర్రా రామారావు,పవన్,ఉపేందర్,లక్ష్మీనారాయణ,లక్ష్మణ్,శ్రీహరి,అశోక రెడ్డి,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.