దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి:ఎం డేవిడ్ కుమార్ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి
కోదాడ,జులై 02(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ నెల 4న ఖమ్మం నగరంలో భక్తరామదాసు కళాక్షేత్రంలో దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా నిర్వహించే రాష్ట్ర సదస్సు,ప్రదర్శనను జయప్రదం చేయాలని స్థానిక లాల్ బంగ్లాలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం డేవిడ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ
విప్లవకారుల ఐక్యతే లక్ష్యంగా రెండు న్యూడెమోక్రసీ పార్టీలు ఉమ్మడిగా జరుపుతున్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య వర్ధంతి సభను ప్రజలు,ప్రజాస్వామిక వాదులు,ఐక్యతను కోరుకునే వారందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.తెలంగాణ సాయుధ రైతంగా పోరాటంలో నైజాం,రజాకార్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా,దున్నేవానికి భూమి లక్ష్యంగా,సాయుధ పోరాటాన్ని దొడ్డి కొమరయ్య అమరత్వంతో కొనసాగిందని అన్నారు.దేశముఖ్,పట్టేల్,పట్వారిలు,జాగిర్దారులు,విస్నూరు రామచంద్రారెడ్డి,జన్నారెడ్డి,ప్రతాపరెడ్డి లాంటి భూస్వాముల అరాచక పాలనను ఎదిరిస్తూ ప్రజలు సాయుధులుగా తిరుగుబాటు చేశారని అన్నారు.ఆ పోరాటంలో 4,000 మంది పైగా అమరత్వం చెందారని,10 లక్షల ఎకరాల భూములను పేద ప్రజలకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పంపిణీ చేశారని,3000 గ్రామాలలో రాజ్యాధికారంను ఏర్పాటు చేసుకున్నారని కొనియాడారు.నేడు భూమి కేంద్రంగా భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా దేశంలో బలమైన పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం,అవశ్యకత ఏర్పడిందని,దాని నేపథ్యంలోనే సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రెండు పార్టీలు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఏకం కానున్నారని తెలిపారు.ఈ సభకు ప్రజలు,ప్రజాస్వామిక వాదులు,సానుభూతిపరులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పోటు లక్ష్మయ్య ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు,అరుణోదయ జిల్లా అధ్యక్షులు ఉదయగిరి,ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కామల నవీన్,సహాయ కార్యదర్శి వి నరసింహ రావు,పివైఎల్ జిల్లా కార్యదర్శి డి రవి,కామల్ల శ్రీను,వేణు,వీరబాబు,కాసిం,సలీం, నాగేష్,సైదులు తదితరులు పాల్గొన్నారు.