పోరాట యోధుడు కి విప్లవ జోహార్లు
కోదాడ,జులై 03(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక లాల్ బంగ్లాలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సీనియర్ నాయకుడు కామ్రేడ్ అలుగుబెల్లి వెంకట నరసయ్య 2 వ,వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా అరుణోదయ జిల్లా అధ్యక్షులు ఉదయగిరి పాల్గొని మాట్లాడుతూ భూమి భక్తి వెట్టి చాకిరీ నుండి విముక్తి కోసం ఆనాటి తెలంగాణ సాయుధ రైతంగ పోరాటంలో సాయుధ పోరాట యోధుడిగా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నాయకుడిగా కామ్రేడ్ అలుగుబెల్లి వెంకట నరసయ్య చురుకైన పాత్ర పోషించారని అన్నారు.నిర్బంధాలు ఎన్ని ఎదురైనా ఏనాడూ వెనకడుగు వేయలేదు నిత్యం అణగారిన పీడత ప్రజల పక్షాన జరిగే పోరాటాలలో నేను సైతం అంటూ వృద్ధాప్యం వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాడు.దున్నేవానికే భూమి అనే నినాదంతో నక్సల్ బరి వసంత మేఘ గర్జనతో మొదలైన విప్లవ పోరాటంలో విప్లవకారుడిగా రైతు కూలీ సంఘం నాయకుడిగా అనేక జిల్లాల్లో జరిగిన సభల్లో తన ఆకట్టుకునే ఉపన్యాసంతో ప్రజలను సంఘటిత పరిచాడని తుది వరకు తాను నమ్ముకున్న ఎర్రజెండా వెలుగులోనే కొనసాగిన ఆదర్శ విప్లవ కమ్యూనిస్టు అని కొనియాడారు.ఈ సందర్భంగా ఆయనకు వినమ్రంగా విప్లవ జోహార్లు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి వి నరసింహారావు,అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు అలుగువెల్లి సత్యనారాయణ రెడ్డి,మైసయ్య,విజయ్,వీరబాబు,రామారావు,కాసిం,నరసింహారావు,సైదులు,కొండయ్య,నాయక్,సురేష్ తదితరులు పాల్గొన్నారు