ఐదేళ్ల పదవి కాలం పై ఓ ఎంపీటీసీ ఆవేదన
కోదాడ,జులై 03(mbmtelugunews)ప్రతినిది మాతంగి సురేష్:ఎంపీటీసీల పదవీకాలం ఐదేళ్లు పూర్తి కావడంతో బుధవారం కోదాడ మండల పరిషత్ కార్యాలయంలో వారికి వీడ్కోలు సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి హాజరైన కూచిపూడి ఎంపిటిసి శంకరశెట్టి కోటేశ్వరరావు తన ఆవేదనను వెళ్లబుచ్చుకున్నారు.ఈ ఐదేళ్ల పదవీకాలంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయానని బాధపడ్డారు.ఎంపీటీసీలు కేవలం జనరల్ బాడీ సమావేశాలకు హాజరై చాయ్ బిస్కెట్ తీసుకునేందుకే పరిమితం అయ్యమని ఆయన బాధపడ్డారు.ఎంపీటీసీలకు గ్రామపంచాయతీ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయంలో ప్రోటోకాల్ ప్రకారం కనీసం కుర్చీ కూడా ఉండదని ఎంపీటీసీ అయ్యాకే తెలిసిందని ఆయన అన్నారు.ఈ ఐదేళ్ల కాలంలో కేవలం ఐదు లక్షల రూపాయల నిధులు మాత్రమే తనకు మంజూరని అన్నారు.ఈ నిధులతో ఎం పనులు చక్కబెట్టాలని,సర్పంచి లాగే తాము ప్రజలతో ఎన్నుకోబడ్డప్పటికీ మాకు కనీస గౌరవం లేకుండా పోయిందని తెలిపారు.ఈ ప్రభుత్వంలోనైనా ఎంపీటీసీలకు కనీస గౌరవం గ్రామపంచాయతీ కేటాయించిన నిధుల్లో సగం మేర కేటాయిస్తే బాగుంటుందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.