తెలంగాణకు రెయిన్ అలర్ట్..ఈ నెల 7,8 తేదీల్లో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ,జులై 05(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది. జులై 7, 8 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేసింది. జులై 7న ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లోనూ.. జులై 8న సోమవారం మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు