Monday, July 7, 2025
[t4b-ticker]

గత 40 ఏళ్లుగా దుకాణాలను నమ్ముకొని జీవిస్తున్న కుటుంబాలను రోడ్డున పడేయోద్దు

గత 40 ఏళ్లుగా దుకాణాలను నమ్ముకొని జీవిస్తున్న కుటుంబాలను రోడ్డున పడేయోద్దు

:మా కుటుంబాలకు పూర్తి జీవనాధారం దుకాణాలే

:ఈ దుకాణాలలో 100 కుటుంబాలు జీవనభృతి పొందుతున్నాయి

:ఉన్నపలంగా వెళ్లగొడితే 100 కుటుంబాలు రోడ్డున పడతాయి

కోదాడ,జులై 09(మనం న్యూస్): కోదాడ మున్సిపల్ కార్యాలయం పక్కన గల కళ్యాణ మండపం ఏరియాలో వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న చిరు వ్యాపారుల దుకాణాలను రోడ్డున పడేయొద్దని దుకాణదారుల స్థానిక మున్సిపల్ కమిషనర్ ఏ రమాదేవికి వినతి పత్రం మంగళవారం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో నీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ పట్టణ అభివృద్ధిలో భాగంగా మున్సిపల్ కార్యాలయ నూతన నిర్మాణాలు చేపట్టటానికి ఆరు కోట్లు నిధులు కేటాయిస్తామని చెప్పటంతో మున్సిపల్ అధికారులు అప్రమత్తమయి మున్సిపల్ కార్యాలయ స్థలాన్ని సర్వే నిర్వహించారు.మున్సిపల్ నూతన కార్యాలయ నిర్మాణం చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ మేము గత 40 ఏళ్లుగా ఇదే వ్యాపారాన్ని చేసుకుంటూ మా కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని అలాంటి కుటుంబాలను రోడ్డున పడేస్తే ఆ కుటుంబాలు రోడ్డు పాలవుతాయి అని అలా కాకుండా మీరు నూతన నిర్మాణాలు చేపడితే మాకు కూడా చిన్నచిన్న సెటర్లు వచ్చే విధంగా కట్టించినట్లయితే వాటికి మేము పన్నులు చెల్లించి మేము ఎప్పటిలాగానే వ్యాపారాలు చేసుకుంటామని అన్నారు.గత 20 30 ఏళ్లుగా గ్రామపంచాయతీ ఉన్న సమయంలో గ్రామపంచాయతీకి పన్ను కట్టాము తర్వాత మున్సిపాలిటీ ఏర్పడ్డాక మున్సిపాలిటీకి పన్ను కట్టుకుంటూ వస్తున్నామని వారు అన్నారు. గతంలో ఈ స్థలం మేము 25 సంవత్సరాలు లీజుకు తీసుకున్నామని కొంతమంది వ్యక్తులు రాగా మేము అప్పటినుండి ఇప్పటివరకు అన్ని పార్టీల వారిని కలుపుకుంటూ వారిపై పోరాటం చేసి ధర్నాలు చేసి వారిని ఈ ప్రాంతానికి రానీయకుండా అడ్డుకున్నామని గుర్తు చేశారు. అదేవిధంగా వక్స్ బోర్డు కు సంబంధించిన సభ్యులు మాకే టాక్స్ కట్టాలని గతంలో వారు వచ్చి మా దుకాణదారులను ఇబ్బంది పెట్టిన మేము వక్స్ బోర్డుకు కట్టము మున్సిపాలిటీ కే పన్నులు చెల్లిస్తున్నామని చెప్పి వారిని పంపించి అప్పటినుండి ఇప్పటివరకు మున్సిపాలిటీకే పనులు చెల్లిస్తున్నామని అన్నారు. కావున సంబంధిత ప్రజా ప్రతినిధులు అధికారులు మా బాధను ఆలకించి మమ్మల్ని రోడ్డున పడేయకుండా మా కుటుంబాలను ఆదుకోవాలని అంటున్నారు.ఈ కార్యక్రమంలో చిరు వ్యాపారుల గౌరవ అధ్యక్షులు షేక్ నయీమ్,గౌరవ సలహాదారులు బొలిశెట్టి కృష్ణయ్య,అధ్యక్షులు పాండురంగారావు,ప్రధాన కార్యదర్శి భూసాని మల్లారెడ్డి,కోశాధికారి ఎండి మహమ్మద్,ఉపాధ్యక్షుడు దస్తగిరి,సహాయ కార్యదర్శి వేణుగోపాలరావు,షేక్ సలీం,హుస్సేన్ బి,హుస్సేన్,షేక్ రహీం,బేగం,సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular