దాతల సహకారంతో ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ:పాస్టర్ ఏసయ్య
కోదాడ,జులై 11(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:బాప్టిస్ట్ చర్చి పెయిత్ గాస్పల్ మినిస్ట్రీ కోదాడ పాస్టర్ ఏసయ్య ఆధ్వర్యంలో తమ్మర సుందరయ్య కాలనీ,గాంధీనగర్ లో నిరుపేదలైన బాల బాలికలకు నోట్స్,టెక్స్ట్ బుక్స్ దాతల సహకారంతో ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.ఇంకా ఎంతో మంది నిరుపేద పిల్లలు చదువుకునే ఆసక్తి ఉన్నప్పటికీ సరైన ఆర్థిక సహకారం లేకపోవటం వల్ల కొందరు పిల్లలు వెనుకబడిపోతున్నారు,దాతలు సహకరిస్తే ఇటువంటి పిల్లలకు,బట్టలు గాని ఆర్థిక సహకారం గాని బుక్స్ గాని అందిస్తే వారు బాగా చదువుకొని ప్రయోజకులుఅయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఆనంద్,దేవేందర్,టీచర్స్ ద్రాక్షావల్లి,విజయ,కోటేశ్వరి,జీవని,నాన్సీ తదితరులు పాల్గొన్నారు.
Pls subscribe https://youtu.be/4AMb6_qCk9Y?si=CYTt36eXelcT9cQq