న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి.
న్యాయదుల హక్కులను రక్షించాలి.
కోదాడ,జులై 11(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణంలోని కోర్టు ఆవరణంలో రాష్ట్ర బార్అసోసియేషన్ ఫెడరేషన్ ఇచ్చిన బందు పిలుపుమేరకు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ కొత్త చట్టాలు అమలు నాటి నుండి ఈరోజు వరకు వరుసగా మూడుసార్లు న్యాయవాదులపై దాడులు జరిగాయన్నారు.భద్రాచలం,వరంగల్,సిద్దిపేటలో న్యాయవాదులపై వరుస దాడులు జరగడం న్యాయవాదులకు నిర్దాక్షిణ్యంగా సంకెళ్లు వేసి కోర్టులో హాజరు పరచడం ఇలాంటి చర్యలను ఖండించాలని కోర్టు ఆవరణంలో బందు పాటించారు.తేదీ 9/7/2024 రోజున సిద్దిపేట న్యాయవాది మారబోయిన రవికుమార్ ని సిద్దిపేట 2టౌన్ ఏఎస్ఐ ఉమారెడ్డి ఆకారణంగా దాడి చేయడానికి అతనికి సహకరించిన 2 టౌన్ సిఐ ఉపేందర్ చర్యలను ఖండిస్తూ కోర్టు విధులను బహిష్కరిస్తున్నాం అన్నారు.చట్టాన్ని గౌరవించాల్సిన పోలీసులే చట్ట వ్యతిరేకంగాన్యాయాన్ని రక్షించే న్యాయవాదిపై దాడి చేయడం
హెయామైన చర్యగా భావిస్తున్నాము.హైకోర్టు ఉత్తర్వులను కాలరాసి బేకాతరు చేస్తూ చట్టాన్ని తనచేతుల్లోకి తీసుకొని రౌడీయిజం చేస్తూ పోలీసు వ్యవస్థకేమాయని మచ్చగా మారిన ఎస్ ఐ ఉమారెడ్డి,సిఐ ఉపేందర్ లను వారి విధులనుండి తొలగిస్తూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోగలరని ఉన్నతాధికారులను ,ప్రభుత్వాన్ని
డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరిస్తున్నాము అన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాధాకృష్ణమూర్తి,ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు,బార్ అసోసియేషన్ సభ్యులు కోడూరు వెంకటేశ్వరరావు,హేమలత,దొడ్డ శ్రీధర్,షేక్ నాగుల్ పాషా,సామా నవీన్ కుమార్,సీనియర్ న్యాయవాదులు ఎలక సుధాకర్ రెడ్డి,తమ్మినేని హనుమంతరావు,కాకర్ల వెంకటేశ్వర్లు,వి రంగారావు,చిలువేరు వెంకటేశ్వర్లు,రాజారాం,రంజాన్ భాష,సాధు శరత్ బాబు,ముల్క వెంకట్ రెడ్డి,బండి వీరభద్రం,రమేష్,అబ్దుల్ రహీం,యశ్వంత్ రామారావు,షేక్ నజీర్,ఉయ్యాల నరసయ్య,కోదండపాణి,జానీ పాషా, బెల్లంకొండ గోవర్ధన్,సీతారామరాజు,తాటి మురళి,షేక్ నాగుల్ మీరా,వెంకటాచలం,భీమయ్య తదితరులు పాల్గొన్నారు.
Pls subscribe to my channel https://www.youtube.com/live/0_KjbD240G4?si=oNdQ779d_tKUaZ7s